Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కడప జిల్లాలో జనావాసాల్లోకి చిరుత... భయాందోళనల్లో సానిపాయి గ్రామస్తులు

కడప జిల్లా వీరబల్లి మండలం సానిపాయిలో నేటి ఉదయం చిరుత పులిని చూసిన గ్రామస్తులు ఉరుకులు పరుగులు పెట్టారు. అరణ్యంలో ఉండాల్సిన చిరుత పులి గ్రామంలోకి వచ్చేసింది. అక్కడ ఏకంగా ఓ చెట్టుపైకి ఎక్కికూర్చుంది. నేటి ఉదయం చెట్టుపై చిరుతను చూసిన గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. వెనువెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత పులిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు.

More Telugu News